ప్రైవేట్ బ్యాంకుల సీఈఓ పదవీకాలం 15 ఏళ్లుగా ఆర్‌బీఐ నిర్ణయం

by Harish |
ప్రైవేట్ బ్యాంకుల సీఈఓ పదవీకాలం 15 ఏళ్లుగా ఆర్‌బీఐ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ బ్యాంకుల సీఈఓలు, ఎండీ, పూర్తి కాల డైరెక్టర్ల పదవీకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయిస్తూ రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశించింది. అలాగే, ఈ పదవులకు గరిష్ఠ వయో పరిమితికి సంబంధించి 70 ఏళ్లుగా ఉంటుందని తెలిపింది. అలాగే, బ్యాంకుల గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. ‘ఎప్పటికప్పుడు అవసరమైన, చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్ల్యూటీడీ పదవిని 15 ఏళ్లకు మించి ఎక్కువ కాలం ఒకే పదవీలో కొనసాగించేందుకు వీలులేదు. ఆ తర్వాత ఎండీ, సీఈఓగా తిరిగి నియామకం కావాలంటే మూడేళ్ల విరామం తర్వాత షరతులకు లోబడి బోర్డు ఆమోదం మేరకు నిమయమించవచ్చని’ ఆర్‌బీఐ తెలిపింది. మూడేళ్ల విరామం సమయంలో సదరు వ్యక్తి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బ్యాంకు లేదా సంస్థ గ్రూప్‌లో బాధ్యతలు తీసుకోకూడదని పేర్కొంది. అలాగే, ఛైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల గరిష్ఠ వయోపరిమితిని 75 ఏళ్లుగా ఆర్‌బీఐ నిర్ణయించింది.

Advertisement

Next Story