- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలర్ట్.. కుక్కల ఆహారంతో ‘డేంజరస్ సూపర్ బగ్స్’
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ పెట్ డాగ్స్ పెంచుకోవడం కామన్ అయిపోయింది. ఇంటికి కాపలాగా, విశ్వాసానికి మారుపేరుగా ఉండే కుక్కలు మనుషులకు స్ట్రెస్ బస్టర్స్‌గానూ పనిచేస్తూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నిలిచాయనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆ బెస్ట్ ఫ్రెండ్‌తోనే ప్రపంచ ఆరోగ్యం ముప్పును ఎదుర్కొంటోంది. డాగ్ ఫుడ్‌లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా(సూపర్ బగ్స్) ఉన్నట్టు తాజా అధ్యయనం బయటపెట్టడంతో.. అంతర్జాతీయంగా ప్రజారోగ్యంపై భయాలను రేకెత్తిస్తోంది.
పెంపుడు కుక్కలకు అందించే పలు రకాల ‘రా (ఉడికించని మాంసం)’ ఫుడ్ .. ఈ యాంటీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకు కారణమని తెలిపిన రీసెర్చర్స్, ఆ వివరాలను ‘యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’కు అందజేశారు. స్టడీలో భాగంగా పోర్చుగల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్టోకు చెందిన ఫార్మసీ ఫ్యాకల్టీ, UCIBIO రీసెర్చర్స్.. సూపర్ మార్కెట్స్, పెట్ షాప్స్‌లోని పలు రకాల డాగ్ ఫుడ్ శాంపిల్స్‌ను పరీక్షించారు. కాగా సగానికి పైగా నమూనాలలో మానవ ప్రేగుల్లో సాధారణంగా కనిపించే ‘ఎంటెరోకోసి’ అనే బ్యాక్టీరియా రకాన్ని గుర్తించినట్టు వెల్లడించారు.
ఇది మానవులు, జంతువుల ప్రేగుల్లో ఉండటం వల్ల ప్రమాదం లేకపోయినా, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే ప్రాణాంతకంగా మారుతుంది. యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఇక యూఎస్‌లో రెండు దశాబ్దాలుగా VRE (వాంకోమైసిన్-రెసిస్టెంట్ ఎంటెరోకోసి)కు సంబంధించిన అంటువ్యాధుల సమూహాలు ఉండగా.. అక్కడి ఆస్పత్రుల్లో తరచుగా ఈ తరహా కేసులు వెలుగు చూస్తున్నాయి. అంతేకాదు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బగ్స్.. చిన్న గాయాలు, సాధారణ ఇన్ఫెక్షన్లనే ప్రాణాంతకం చేస్తాయి.
ప్రపంచ ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పు..
ఈ డ్రగ్-రెసిస్టెంట్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వరల్డ్ వైడ్‌గా ప్రతీ ఏట 7 లక్షల మంది మరణిస్తున్నట్టు అంచనా కాగా, 2050లోగా ఆ సంఖ్య 10 మిలియన్‌కు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. డబ్లూహెచ్‌వో సైతం దీన్ని ప్రపంచ ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పుగా వర్గీకరించింది. ప్రధానంగా అంతర్జాతీయ బ్రాండ్లు సరఫరా చేసే డాగ్ ఫుడ్.. ఈ ఎంటెరోకోసి బ్యాక్టీరియాకు వాహకంగా పనిచేస్తోందని అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే పెంపుడు జంతువులకు పచ్చి మాంసాన్ని ఆహారంగా ఇచ్చేటపుడు దాని వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి అవగాహన పెంచుకోవాలని.. పదార్ధాల ఎంపికలో జాగ్రత్తలతో పాటు పరిశుభ్రతను పాటిస్తూ డాగ్ ఫుడ్‌ను ప్రిపేర్ చేసుకోవాలని కుక్కల యజమానులను రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వాటికి ఆహారాన్ని అందించినపుడు, మలాన్ని తీసినపుడు ఖచ్చితంగా సబ్బు నీటితో చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు.