నిజామాబాద్ విద్యుత్ శాఖ ఎస్ఈగా రవీందర్..

by Shyam |
నిజామాబాద్ విద్యుత్ శాఖ ఎస్ఈగా రవీందర్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా రవీందర్‌ను నియమిస్తూ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ఎస్‌ఈగా పనిచేసిన సుదర్శన్‌ను ఇటీవల పెద్ధపల్లి జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ ఇన్‌చార్జి ఎస్ఈగా ప్రస్తుతం వరంగల్ కార్పొరేట్ ఆఫీసులో సీజీఎంగా పనిచేస్తున్న ప్రభాకర్‌ను నియమించారు. వరంగల్ కార్పొరేట్ ఆఫీసులో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆర్.రవీందర్‌ను నిజామాబాద్ ఎస్ఈగా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రవీందర్ గతంలో నిజామాబాద్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేశారు. సోమవారం రవీందర్ బాధ్యతలు స్వీకరించున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story