- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్లందరికీ వారితో అక్రమ సంబంధం ఉందా? డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : నటుడిగానే కాక డిఫరెంట్ జోనర్ సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగానూ ప్రత్యేకత చాటుకున్న వ్యక్తి రవిబాబు. ఎటువంటి వివాదాల్లో తలదూర్చని రవిబాబుపై ఈ మధ్య సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అతడికి ఓ నటితో అక్రమ సంబంధం ఉందని, ఆమెతో వరుస సినిమాలు చేసేందుకు అదే కారణమనేది ఆ ఫేక్ న్యూస్ సారాంశం. ఈ విషయంపై రీసెంట్ ఇంటర్వ్యూలో రవిబాబు స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టాడు.
‘హీరోయిన్ పూర్ణ నా డైరెక్షన్‌లో వచ్చిన మూడు సినిమాల్లో నటించింది. అయితే ఆమెతో వరుసగా సినిమాలు తీసినంత మాత్రాన మా మధ్య ఎఫైర్ ఉందంటూ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్. అలా ఆలోచిస్తే.. ఒకే దర్శకునితో రెండుమూడు సినిమాలు తీసిన హీరోయిన్లందరికీ డైరెక్టర్లతో ఎఫైర్ ఉన్నట్లేనా?’ అని ప్రశ్ని్స్తూ ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.
షూటింగ్ పూర్తయిన తర్వాత తాను హీరోయిన్లతో మాట్లాడటం గానీ, వారిని కలవడం కానీ చేయనని.. విలువలకు కట్టుబడి జీవిస్తానని, మహిళలను గౌరవిస్తానని ఆయన చెప్పాడు. అలాగే పూర్ణ యాక్టింగ్ నచ్చింది కాబట్టే ఆమెతో మూడు సినిమాలు చేశాను తప్ప మరో కారణం లేదని, దయచేసి ఇలాంటి ప్రచారాలు ఆపేయాలని కోరాడు. ఇక రవిబాబు దర్శకత్వంలో పూర్ణ ‘అవును, అవును 2, లడ్డు బాబు’ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.