- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విశ్వామిత్రుడు @ ఆరున్నర కోట్లు
బ్రహ్మర్షి విశ్వామిత్రుడేంటి? ఆరున్నర కోట్లేంటన్న అనుమానం వచ్చిందా?…అక్కడికే వస్తున్నా.. నేను చెప్పేది విశ్వామిత్రుడి పెయింటింగ్ గురించి. భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడిగా రాజా రవివర్మ చరిత్రలో నిలిచిపోయారు. డావిన్సీ తరహాలో రవివర్మ కుంచె నుంచి జాలువారిన కళాఖండాలకు విశేషమైన అభిమానులున్నారు. ఆయన గీసిన చిత్రమంటే చాలు. కోట్ల రూపాయలు గుమ్మరించి కొనుక్కుంటారు. తాజాగా ఆయన గీసిన విశ్వామిత్రుడి పెయింటింగ్‌ను ప్రముఖ వేలం సంస్థ సోత్ బీస్ వేలానికి పెట్టింది. ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన వేలం ప్రక్రియకు విశేషమైన స్పందన లభించింది. గత నెలలో బిడ్డింగ్ నిర్వహించగా రెండు రోజుల క్రితం ఈ ప్రక్రియ ముగిసింది. దీంతో రవివర్మ ‘విశ్వామిత్రుడు’ పెయింటింగ్ ను ఓ అజ్ఞాత వ్యక్తి రూ.6.45 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. రెండేళ్ల కిందట రవివర్మ కుంచె నుంచి జాలువారిన ‘దమయంతి’ పెయింటింగ్ ఇంతకు రెట్టింపు ధర పలికిన సంగతి తెలిసిందే.
Tags : viswamitra, ravi varma, paintings, south bay, online auction,