- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
డి విలియర్స్ సత్తా ఇంకా తగ్గలే : రవిశాస్త్రి
దిశ, స్పోర్ట్స్ :
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డి విలియర్స్ ప్రస్తుతం IPLలో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. షార్జాలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో డి విలియర్స్ తన బ్యాటింగ్ ఎబిలిటీని చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 73 పరుగులు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. కాగా, 2018 మే నెలలో డి విలియర్స్ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ చెప్పాడు.
అయితే, డివిలియర్స్ 2021లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా తరపున ప్రాతినిథ్యం వహించాలని టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కోరాడు. డి విలియర్స్ ఆటలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని రవిశాస్త్రి అంటున్నాడు. క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందని.. ప్రస్తుతం కరోనా కారణంగా ఆటకు నష్టం చేకూరిందని.. ఈ సమయంలో డి విలియర్స్ వంటి వాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలని శాస్త్రి పేర్కొన్నాడు.