ఐపీఎల్‌కే తొలి ప్రాధాన్యం: రవిశాస్త్రి

by  |   ( Updated:2020-05-16 11:12:47.0  )
ఐపీఎల్‌కే తొలి ప్రాధాన్యం: రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ నేపథ్యంలో స్తంభించిపోయిన క్రికెట్‌ను ఒకటి, రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని పలు క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. కాగా, ఇప్పట్లో ఐసీసీ టోర్నీలు నిర్వహించకపోవడమే మంచిదని భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. క్రీడలు ప్రారంభమైతే ఐపీఎల్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నాడు. టీ20 వరల్డ్ కప్ తదితర టోర్నీలు నిర్వహించినా ప్రేక్షకులు ఇళ్లు దాటి బయటకు వస్తారని తాను భావించడం లేదన్నారు. అందరూ ఇంటికే పరిమితమైన సమయంలో ముందుగా దేశవాళీ క్రికెట్ ప్రారంభించడం మంచిదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీసులు ఆడటం వల్ల ప్రేక్షకుల్లో కొంచెం ధైర్యాన్ని నింపవచ్చు, ఆతర్వాత నెమ్మదిగా ఐసీసీ టోర్నీలను పునః ప్రారంభించవచ్చన్నాడు. నేనైతే ఐసీసీ టోర్నీల కంటే ద్వైపాక్షిక సిరీస్‌లనే ఎంచుకుంటామని, ఆటగాళ్లు కూడా ప్రస్తుతం తక్కువ నిడివి గల సిరీస్‌లను ఆడటానికే మొగ్గు చూపుతారని భావిస్తున్నట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed