- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోవిడ్ టీకా తీసుకున్న టీం ఇండియా హెడ్ కోచ్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కోవిడ్-19 టీకాను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో మంగళవారం ఆయన అహ్మదాబాద్‌లో టీకాను తీసుకొని ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘కోవిడ్ 19 టీకాను ఇప్పుడే తీసుకున్నాను. ఈ దేశాన్ని కోవిడ్‌పై పోరాటంలో శక్తివంతంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బందికి నా ధన్యవాదాలు.
అహ్మదాబాద్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను సమర్దవంతంగా నిర్వర్తిస్తున్న అపోలో ఆసుపత్రి సిబ్బందికి నా అభినందనలు’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు. ఈ రోజు మొదటి డోస్ తీసుకున్న శాస్త్రి మరో 15 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉన్నది. కాగా, టీమ్ ఇండియా చివరి టెస్టు ఫిబ్రవరి 4 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలోనే నిర్వహించనున్నారు. దీంతో టీమ్ ఇండియా పూర్తి స్థాయిలో సాధన ప్రారంభించింది. ఈ మ్యాచ్ డ్రా చేసినా, గెలిచినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.