‘మరణించిన తర్వాతే కరోనా అని తెలిసింది’

by Shyam |

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రిలో మరణించిన రవికుమార్ విషయంలో కొత్త కోణం వెలుగు చూసింది. తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పినా.. వైద్యులు నిర్లక్ష్యం వహించారని బాధితుడు చనిపోయే ముందు తన తండ్రికి సెల్ఫీ వీడియో పంపాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తన కొడుకు మృతిపై తండ్రి స్పందించాడు. ఈ నెల 24న రవికుమార్‌కు జ్వరం వచ్చిందని.. 11 హాస్పిటల్స్‌లో చూపించిన ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో చేర్చించామని.. 26న వెంటిలేటర్ తొలగించడంతోనే తన కొడుకు మరణించాడన్నారు. మరణించిన తర్వాతే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని రవికుమార్ తండ్రి వెంకటేశ్ చెప్పుకొచ్చారు. అయితే, కరోనా ప్రభావం గుండెకు చేరడంతో వెంటిలేటర్ పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed