- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు లక్షల నగదును కొట్టేసిన ఎలుకలు
దిశ, మహబూబాబాద్: కష్టపడి సంపాదించి కూడబెట్టిన రెండు లక్షల నగదును ఎలుకలు చిత్తడి చిత్తడి చేశారు. ఆరోగ్యం బాగోలేక, కంతి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో బాధితుడు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండల పరిధిలోని వేంనూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… వేంనూరు గ్రామ శివారు ఇందిరా నగర్‌తండాకు చెందిన బి.రెడ్యా గత కొన్నేండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పంటపై వచ్చిన డబ్బులను ఆపరేషన్ నిమిత్తం పోగుచేసి దాచుకున్నాడు. గతకొద్ది రోజులుగా కురుస్తు్న్న వర్షాల కారణంగా రెడ్యా నివాసం ఉంటున్న గుడిసె కురిసి, ఎలుకుల బెడద ఎక్కువైంది.
దీంతో భారీగా ఇంట్లో ఎలుకలు చేరి, సంచిలో దాచుకున్న రూ.2 లక్షల నగదును కొరికాయి. దీంతో అవి ఏమాత్రం పనికిరాకుండా పోయాయి. చిరిగిన నోట్లను తీసుకొని బాధితుడు పలు బ్యాంకులను సంప్రదించినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పలు బ్యాంకు అధికారులు రిజర్వ్ బ్యాంకు వెళ్లి సంప్రదించాలని సూచించారు. దీంతో ఎన్నో ఏండ్ల కష్టం ఎలుకల పాలుకావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.