కష్టపడి సంపాదించిన డబ్బు ఎలుకల పాలు

by Shyam |
rats, eat 5 Thousand rupees
X

దిశ, మోత్కూరు: తిండీ తిప్పలు మాని కష్టపడి సంపాదించింది. కూలీనాలి చేసి పైసా పైసా కూడబెట్టింది. చివరకు ఆమె కష్టం మొత్తం బుడిదలో పోసిన పన్నీరు అయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన కొలుగూరి లక్ష్మి తాను కూలీకి వెళ్లి సంపాదించుకున్న ఐదు వేల రూపాయలను బీరువాలో దాచుకుంది. శుక్రవారం కొంత డబ్బు అవసరం ఉండి బీరువా ఓపెన్ చేయగా, డబ్బులు మొత్తం ఎలుకలు కొట్టాయి. ఆ డబ్బులను చూసిన బాధితురాలు కన్నీరుమున్నీరు అయింది. ప్రభుత్వం తనపై దయచూపి ఆదుకోవాలని వేడుకుంటోంది.

Advertisement

Next Story