విలేజ్ మాల్స్‌గా మారనున్న రేషన్ దుకాణాలు!

by Sridhar Babu |   ( Updated:2021-12-23 02:07:36.0  )
Ration-Shops1
X

దిశ, కాటారం : రాష్ట్రంలో రేషన్ షాపులు విలేజ్ మాల్స్ గా మారనున్నాయి. తద్వారా రేషన్ షాపులు నిర్వహిస్తున్న యజమానులకు ఆర్థికంగా ఉపాధి లభించనుంది. రేషన్ దుకాణాలలోని అన్ని సరుకులు క్రయవిక్రయాలు జరుపుకునేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు దొమ్మాటి రవీందర్ తెలిపారు. డీలర్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రూ. 50 వేల నుండి రూ. 8 లక్షల వరకు బ్యాంకుల ద్వారా ముద్ర రుణాలు ఇప్పించేందుకు కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో మోడల్ రేషన్ షాపు భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని, ఫేస్ రేషన్ షాపు నిర్వహణ కోసం ఇంటి కిరాయి, కరెంట్ బిల్లు కోసం రూ.3 వేల నుండి రూ. 6 వేల వరకు చెల్లించాలని, రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమిషన్ రూ. 200 వరకు పెంచాలని వినతి పత్రాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ కు ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed