రేషన్ కార్డుదారులకు తపాలా సేవలు..

by Anukaran |   ( Updated:2021-02-03 00:18:48.0  )
రేషన్ కార్డుదారులకు తపాలా సేవలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు తపాలా సేవలు అందుబాటులోనికి రానున్నాయి. అందుకోసం తపాలా కార్యాలయాల్లో ఆధార్‌కార్డుతో ఐరిస్, ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలి. తెలంగాణలోని 28 జిల్లాల్లో 124 ఆధార్ కేంద్రాలు ఉండగా.. ఆధార్‌తో ఫోన్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

లేనియెడల తపాలా సేవలు పొందేందుకు అనర్హులు అవుతారని తెలిపింది. దీంతో రేషన్ కార్డులకు అనుసంధానం కోసం లబ్ధిదారుల ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మీసేవ, ఈసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు బారులు తీరారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రాత్రి నుంచి జనాలు పడిగాపులు కాస్తున్నారు.

Advertisement

Next Story