ప్రేమించిన దాని కోసం పోరాడండి : రష్మిక

by Shyam |
ప్రేమించిన దాని కోసం పోరాడండి : రష్మిక
X

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా ‘డియర్‌ కామ్రేడ్‌’. గీత గోవిందం సినిమాతో విజయ్, రష్మికల జోడీ.. అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ క్రమంలోనే మరోసారి ఇదే జోడీతో తీసిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. జులై 26, 2019లో భరత్ కమ్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకోగా.. ఇందులో విజయ్ విప్లవ భావాలున్న కాలేజీ స్టూడెంట్‌గా, రష్మిక క్రికెటర్‌ అపర్ణా దేవి అలియాస్ లిల్లీగా నటించింది. ఈ చిత్రం విడుదలై నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లిల్లీ ఓ భావోద్వేగ పోస్ట్‌ను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘ఒక మహిళగా, ఫైటర్‌గా.. ప్రేమించినదాని కోసం పోరాటం చేయండి. క్రికెట్ బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియని రోజు నుంచి ఫ్రంట్ డ్రైవ్ ఇలా కొట్టాలి అనే వరకు నా ప్రయాణం సాగింది. నాకే ఇది పాసిబుల్ అయ్యిందంటే.. ఎవరికైనా ఏదైనా సాధ్యమవుతుంది. నన్ను నమ్మండి.. మనం తలచుకుంటే అన్నీ చేయొచ్చు. కానీ కాస్త సమయం పట్టొచ్చు. సాధన చేయండి, ప్రయత్నించండి.. అది జరిగి తీరుతుంది. కొంచెం ఓపికతో పాటు కాస్త మన మీద మనకు నమ్మకముంటే చాలు.. లక్ష్యాన్ని తప్పక సాధిస్తాం. మీ అందరికీ ఆ శక్తిని అందిస్తూ.. ఎంతో ప్రేమను కూడా ఈ ప్యాకెట్‌తో అందిస్తున్నాను’ అంటూ లవ్, లెటర్, గిఫ్ట్ బాక్స్ ఎమోజీలను పోస్ట్ చేసింది రష్మిక. దీంతో పాటు డియర్ కామ్రేడ్ చిత్రం కోసం క్రికెట్ సాధన చేస్తున్న వీడియోను కూడా ఆమె పంచుకున్నారు.

https://www.instagram.com/tv/CDEofSXpcXb/?igshid=6e7ul7o8ugqi

Advertisement

Next Story