- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శర్వాకు జోడీగా చార్మింగ్ బ్యూటీ ?
దిశ, వెబ్‌డెస్క్: ‘నేను శైలజ’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల.. ‘ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి’ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పించాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాను ప్రకటించినా, ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. దీంతో కిషోర్.. ‘రెడ్’ సినిమాతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రెడ్ సినిమా పూర్తి కావడంతో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాను శర్వానంద్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. విజయదశమి సందర్భంగా రేపు తిరుపతిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో శర్వాతో జతకట్టే హీరోయిన్‌ను కూడా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతూ లక్కీ బ్యూటీ అనిపించుకున్న రష్మిక మందన్న ఈ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కిషోర్ తిరుమల సినిమాల్లో నటనకు గాను హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. టైటిల్‌లోనే హీరోయిన్‌కు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ సినిమాను రష్మిక ఒప్పుకుంటే.. తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచే అవకాశం ఉంది. కాగా రష్మిక ప్రస్తుతం బన్ని సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.