రష్మిక మందన @3.. ‘వి ఇంప్రెస్డ్’

by  |   ( Updated:2021-02-02 04:51:16.0  )
రష్మిక మందన @3.. ‘వి ఇంప్రెస్డ్’
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రీ ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసుకుంది. మూడేళ్లలో ఎన్నో మ్యాజికల్ మెమొరీస్‌తో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ..‘చూసి చూడంగానే నచ్చేశావే’ అని యూత్ పాట పాడుకునేలా చేయడంతో పాటు తన యాక్టింగ్ స్కిల్స్‌తో ‘వి ఇంప్రెస్డ్’ అనిపించేసింది. ‘గీతాగోవిందం’ సినిమా తర్వాత కెరీర్ ఊపందుకోగా, అంతే జోష్‌తో కెరీర్‌లో దూసుకుపోతోంది. ‘ఛలో’ చిత్రంలో క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్‌లో కనిపించి జాయ్ ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రష్మిక.. వెంటనే వచ్చిన ‘గీతా గోవిందం’లో ఫుల్ ఆపోజిట్ రోల్ చేసి వావ్ అనిపించింది.

ఫుల్లీ మెచ్యూర్డ్, కొంచెం నెగెటివ్ షేడ్స్, ఆపై కాస్త కోపంతో..ఒకే క్యారెక్టర్‌లో భిన్నమైన షేడ్స్ చూపించి డిలైట్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మొత్తానికి ‘గీతా’ క్యారెక్టర్ ఆమె కెరీర్‌‌ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయేలా చేసింది. బడా నిర్మాతలు, దర్శకుల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తాయి.ఈ క్రమంలో నాని, నాగార్జున మల్టీ స్టారర్ మూవీ ‘దేవదాస్’‌లో నటించే అవకాశం దక్కించుకుంది. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా సరే.. తన మార్క్ చూపించడంలో మాత్రం సక్సెస్ అయింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించి ది బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వగా, యూత్ తనను ‘లిల్లీ’గా ఆరాధించడం మొదలుపెట్టారు.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆమె యాక్టింగ్ స్కిల్సే ఆమెకు మరిన్ని ఆఫర్స్ తీసుకొచ్చాయి అని చెప్పడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ చాన్స్ నిదర్శనం. సూపర్ స్టార్ మహేశ్ బాబును విసిగిస్తూ, ప్రేమిస్తూ, అల్లరి చేస్తూనే, టైమ్లీ డైలాగులతో ప్రేక్షకులను నవ్వించి టిపికల్ క్యారెక్టర్‌‌‌లో అమేజింగ్ అనిపించిన రష్మిక .. ‘వి ఇంప్రెస్డ్ విత్ యువర్ పర్‌ఫార్మెన్స్’.. అని ఆడియన్స్‌తో చెప్పించింది. కాగా, రష్మిక కెరీర్‌లో హైయెస్ట్ ప్రాఫిట్ ఎర్నింగ్ సినిమా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత నితిన్ హీరోగా ‘భీష్మ’ సినిమా చేసిన రష్మిక, మరోసారి తన నుంచి బెస్ట్ యాక్టింగ్‌తో మెప్పించి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్‌లు అందుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో డీగ్లామరస్ రోల్ ప్లే చేస్తున్న రష్మిక.. శర్వానంద్‌తో కలిసి ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాను లైన్‌లో పెట్టింది. మొత్తానికి తెలుగులో మూడేళ్ల సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న మందన..అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్‌లో సత్తా చాటేందుకు సన్నద్ధం అయింది. బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’, కోలీవుడ్‌లో ‘సుల్తాన్‌’తో ఎంట్రీ ఇవ్వబోతున్న తనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story