మోస్ట్ డిజైరబుల్‌ ఉమన్‌గా రష్మిక మందన

by Shyam |   ( Updated:2021-06-01 02:54:04.0  )
Rashmika Mandanna
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ రష్మిక మందన (Rashmika Mandanna )ఎప్పటికప్పుడు న్యూ గోల్స్ సెట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంది. 2016లో కన్నడ సినిమా ‘కిరాక్ పార్టీ’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన భామ చాలా కొద్ది కాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్రమంలోనే గూగుల్ గతేడాది రష్మికను ‘నేషనల్ క్రష్‌’గా డిక్లేర్ చేసింది. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్‌ రేంజ్ అందుకున్న భామ.. ‘సుల్తాన్’ సినిమా ద్వారా కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టడంతో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది లిల్లీ. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘గుడ్ బై’ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న మందన.. ఇటు సౌత్ అటు నార్త్‌లోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియిన్ ఫాలోవర్స్‌ను కలిగిన భామ… రెండోసారి ‘బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్ 2020’గా సెలెక్ట్ అయింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్న రష్మిక ‘మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌’గా నిలవడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్‌లతో ఈ అకేషన్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Rashmika Mandanna is the Bangalore Times Most Desirable Woman of 2020

Advertisement

Next Story