- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాన్నకు ప్రేమతో.. రష్మిక పోస్ట్
రష్మిక మందన్న లాక్‌డౌన్ టైమ్‌లో అభిమానులతో చాలా విషయాలు పంచుకుంది. చిన్నప్పటి మ్యాగజైన్ కవర్ పేజ్ నుంచి సినిమాల్లోకి వచ్చే వరకు ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంది. కుటుంబ సభ్యుల గురించి అనేక విషయాలు వెల్లడించింది. అయితే ఇంతకు ముందు అమ్మ, చెల్లి గురించి మాత్రమే చెప్పిన రష్మిక.. తన జీవితంలో నాన్న స్థానం ఎంత ప్రత్యేకమో తాజా పోస్ట్ ద్వారా తెలపడం విశేషం.
‘నేను పుట్టే కొన్ని రోజుల ముందు.. డాడీ ఒక కల కనేవారట. పొడవాటి జుట్టు, పెద్ద కళ్లు, అందమైన ముక్కుతో ఉన్న ఆడపిల్ల పుట్టాలని.. చిన్ని చిన్ని పాదాలతో తన పొట్టపై డాన్స్ చేయాలని కోరుకున్నాడట. కానీ నేను పుట్టాక నాన్న బిజినెస్ పని మీద ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఇక నా స్కూల్, కాలేజ్ టైమ్‌లో హాస్టల్‌లోనే ఉండటం వల్ల తనతో గడిపే అవకాశం పొందలేకపోయినట్లు’ చెప్పింది. కానీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక.. వాళ్ల నాన్న వ్యాపారంలో తను కూడా భాగస్వామిగా మారడంతో.. ఎంత దూరంగా ఉన్నా తన లైఫ్‌లో నాన్న ఒక పిల్లర్‌లా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ‘మేము ఎక్కువ విషయాలు షేర్ చేసుకోం కానీ, అవసరమయ్యే విషయాలు మాత్రం పంచుకుంటాం. నాన్నకు కూడా తెలుసు.. నేను నాన్నకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్‌గా ఉంటాను’ అని చెప్పింది రష్మిక.
” ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే.. మనలో చాలా మంది అంటుంటారు తండ్రికి మనకు మధ్య బంధంలో కొంచెం దూరం ఉంటుందని.. కానీ నాన్న అంత కఠినంగా ఉండేందుకు కారణం.. మనం జీవితంలో రాణించాలని.. మనకు అంతా మంచే జరగాలని.. లైఫ్ లో గొప్ప స్థానం పొందాలి” అని తెలిపింది.
” పెద్దలు చెప్తుంటారు.. మహిళలు తమ ఎమోషన్స్ బయట పెట్టగలరు కానీ పురుషులు అలా చేయలేరని.. అవును ఇది నిజమే. అందుకే నాన్న నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు ఇంత సమయం పట్టింది” అని చెప్తుంది రష్మిక.
View this post on Instagram
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on Jun 15, 2020 at 9:53am PDT