- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో అరుదైన ఆర్కిడ్‌లు
దిశ, జడ్చర్ల : స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్లలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన ఆర్కిడ్ జాతులు పుష్పించాయి. ఆర్కిడ్ జాతులు ఉండటం అడవి యొక్క నాణ్యతను తెలియజేస్తుందని గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య తెలిపారు.
ఆర్కిడ్‌లు పెద్ద పెద్ద అభయరణ్యాలలో మాత్రమే వుంటాయని వాటిని సేకరించడం, గుర్తించడం, పెంచడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. అవి తేమ ఎక్కువ గల ప్రదేశాలలో పెరుగుతాయన్నారు. అటువంటి అరుదైన జాతులను నల్లమల, అనంతగిరి, మారేడుమిల్లి, శేషాచలం అడవులనుండి సేకరించామన్నారు.
సుమారుగా 13 జాతుల ఆర్కిడ్ లను గార్డెన్‌లో సంరక్షిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ తెలిపారు. అందులో ప్రస్తుతం హాబినేరియా ఫర్సిఫెరా, హాబినేరియా ప్లాంటాజినియా, హాబినేరియా మార్జినేట లు వికసించాయి. ఇందులో హాబినెరియా ఫర్సిఫెరా అనే మొక్కను 2016 లో డా. సదాశివయ్య, డా. ప్రసాద్ తెలంగాణలో మొదటిసారిగా గుర్తించారు.
హాబినెరియా గిబ్సోని అనే మొక్కను ఇటీవల అనంతగిరి అడవుల్లో సదాశివయ్య శిష్యుడు పరమేష్ గుర్తించారు. ఈ మొక్క గత నెలలో గార్డెన్‌లో వికసించింది. ఈ మొక్క దుర్గందాన్ని వేదజల్లుతూ వుంటే మిగతా పుష్పాలు వాసన రహితంగా ఉంటాయి.
ఇవే కాకుండా హాబినేరియా రామయ్యాన, వాండా టెస్సేల్లేట, జియోడోరం డెన్సీఫ్లోరం, సింబిడియమ్ ఆలోయిఫోలియం లాంటి మొక్కలెన్నో గార్డెన్‌లో ఉన్నాయి. ఈ పరిశోధనల్లో డా. సదాశివయ్యతో పాటు పరిశోధక విద్యార్థులు రామకృష్ణ, రాజు, శివ, రమాదేవిలు పాల్గొన్నారు.