ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం..చివరికి..!!

by Sumithra |   ( Updated:2021-04-14 05:33:13.0  )
ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం..చివరికి..!!
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రేమిస్తున్నానని మాయమాటలు చెబుతూ ఇంట్లో అద్దెకు ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు జగద్గిరిగుట్ట పోలీసులు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయ నగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న మైనర్ బాలిక(15)పై ఇంటి ఓనర్ కుమారుడు మధుసూదన్ రెడ్డి గత ఫిబ్రవరి నుండి తరచూ హత్యాచారానికి పాల్పడుతున్నాడని, గతరాత్రి మరోసారి హత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో బాలిక ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఏకాంతంగా గడిపిన వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు విషం సేవించినట్లు తెలిపారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. బాలిక వాంగ్మూలం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed