మహిళపై అత్యాచారయత్నం

by Sumithra |
మహిళపై అత్యాచారయత్నం
X

దిశ, మెదక్: ఓ వివాహితపై అత్యాచారానికి యత్నించిన ఘటన హత్నూర మండలం కొన్యాల గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు తల్లి తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత గురువారం రాత్రి తన తల్లి, అమ్మమ్మతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అయితే రాత్రి సమయంలో ఆమె మూత్ర విసర్జనకు బయటకు వెళ్లగా ఓ వ్యక్తి ఆమె చెయి పట్టుకుని లాక్కెళ్లాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు రావడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు శుక్రవారం హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

tag; rape attempt, medak, ts news

Advertisement

Next Story

Most Viewed