- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెండే కదా అని ఇంటికి పిలిస్తే.. భార్యపై కన్నేసి, వీడియో రికార్డు చేసి..
దిశ, వెబ్‌డెస్క్ : స్నేహితుడే కదా అని ఇంటికి పిలిచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా ఫ్రెండ్ భార్యపైనే కన్నేశాడు. ఆమెను పలుమార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి సమయంలో వీడియో తీసి ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఇదంతా భరించలేని సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ మృగాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న తన స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ప్రశాంత్ స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఇంట్లో తన స్నేహితుడు లేని సమయం చూసుకొని మరీ అక్కడికి వెళ్లి ఆమెను ప్రేమిస్తున్నానని వేధింపులకు గురిచేసేవాడు. అంతటితో ఆగకుండా నువ్వు ప్రేమించకపోతే చచ్చిపోతాను.. లేదంటే చంపుతానంటూ స్నేహితుడి భార్యను ప్రశాంత్ టార్చర్ చేసేవాడు.
ఈ క్రమంలో ఓరోజు ఆమెపై అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి చేసిన ఘటనను వీడియో తీసి తనను బ్లాక్ మెయిల్ చేసినట్టు సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఆమె దగ్గర ప్రశాంత్ ఇప్పటి వరకు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానంటూ ప్రశాంత్ బెదిరించాడు. ఈ వేధింపులను భరించకలేక బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇదో వింత ట్విస్ట్.. ప్రేమాయణం ముగిసిందని ప్రేయసి ఏం చేసిందంటే ?