రణ్‌‌వీర్ డబుల్ ధమాకా!

by Shyam |
రణ్‌‌వీర్ డబుల్ ధమాకా!
X

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌‌వీర్ సింగ్, డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింబా’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందించి, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాంటి సూపర్ ఎనర్జిటిక్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ అందించే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందని బాలీవుడ్ టాక్.

షేక్స్‌పియర్ రాసిన ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ నవల ఆధారంగా 1982లో వచ్చిన కామెడీ చిత్రం ‘అంగూర్’ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రోహిత్ శెట్టి. 2015లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నా అప్పుడు కుదరలేదు. కాగా ప్రస్తుతం రణ్‌వీర్ హీరోగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం. పుట్టగానే వేరైన ఇద్దరు ట్విన్స్.. పెద్దయ్యాక కలిసినప్పుడు జరిగే కామెడీయే ఈ చిత్ర కథ కాగా.. రణ్‌వీర్ ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. రణ్‌వీర్ సింగ్ అభిమానులకు నిజంగా ఇది గ్రేట్ న్యూస్ కాగా.. రణ్‌‌వీర్ ‘83’ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. మరోవైపు అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి లేటెస్ట్ మూవీ ‘సూర్యవంశి’ 2021, జనవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story