తాజ్ మహల్‌పై కంగనా సోదరి కామెంట్స్

by Shyam |   ( Updated:2020-04-08 04:01:33.0  )
తాజ్ మహల్‌పై కంగనా సోదరి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్‌పై కౌంటర్ వేసి విమర్శల పాలైంది. తాజ్‌మహల్‌ను భారతీయులంతా ప్రేమకు ప్రతిరూపంగా భావించడం లేదని … ఒక సమాధి ఎప్పటికీ ప్రేమకు చిహ్నం కాలేదని కామెంట్స్ చేసింది. తాజ్ మహల్‌ను ప్రపంచ వింతగా పరిగణించాలని ప్రజలపై ఒత్తిడి కూడా ఉందని పేర్కొంది. ముంతాజ్ మీద ఉన్న ప్రేమతో షాజహాన్ తాజ్ మహల్‌ను కట్టించాడని చెప్తున్నా… ఆమెను షాజహాన్ ఎన్ని కష్టాలు పెట్టేవాడో తెలుసుకోవాలంది. తాజ్ మహల్‌ నిర్మాణంలో భాగస్వాములైన కళాకారులను కూడా షాజహాన్ హింసించాడని ట్వీట్ చేసింది రంగోలి.

దీంతో రంగోలి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్లు. నీకు తెలిసిన చరిత్రను నీ దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తాజ్ మహల్‌ను ఏడు వింతల్లో ఒక్కటిగా ప్రపంచమే గుర్తించిందని… చరిత్రలో నిలిచిపోయిన తాజ్‌ను నువ్వు గుర్తించాల్సిన అవరసరం లేదన్నారు. దేశ ప్రజలంతా గర్వపడే ప్రేమ కట్టడం గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదన్నారు. కాగా రంగోలి ఇంతకు ముందు కూడా చాలా విషయాల్లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Tags: Rangoli Chandel, Kangana Ranaut, Taj Mahal, Bollywood

Advertisement

Next Story