రెంజల్ ఎస్ఐ శంకర్ సస్పెన్షన్

by Shyam |
రెంజల్ ఎస్ఐ శంకర్ సస్పెన్షన్
X

దిశ, బోధన్:
నిజామాబాద్ జిల్లా బోధన్ ఏసీపీ పరిధిలోని రెంజల్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శంకర్‌ను గురువారం సస్పెండ్ చేస్తూ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ శంకర్‌పై ఇసుక మాఫియాతో మమేకమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మండలంలోని ఇతర శాఖలలోని ఇద్ధరు మహిళా అధికారులను సంబంధం లేని విషయంలో వేధించడంతో వారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కలెక్టర్ అదేశాల మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. గురువారం ఉదయం ఎస్ఐ శంకర్‌ను సస్పెండ్ చేసిన అధికారులపై ఒక మాజీ మంత్రి ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డర్‌లను ఆపే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఎస్ఐ శంకర్ గతంలో నిజామాబాద్ నగరంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహించినప్పుడు అవినీతి ఆరోపణల అధికారులు సస్పెండ్ చేసినా తీరు మారలేదు.

Advertisement

Next Story

Most Viewed