నితిన్ పెళ్లి కానుక వచ్చేసింది..

by Jakkula Samataha |
నితిన్ పెళ్లి కానుక వచ్చేసింది..
X

నితిన్, షాలినిలు ఈ రోజు (ఆదివారం) సాయంత్రం మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. అయితే నితిన్ పెళ్లి కానుకగా.. ‘రంగ్ దే’ చిత్ర యూనిట్.. నితిన్‌తో పాటు ఆయన అభిమానులకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్‌ను ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం ఈ మూవీ యూనిట్ నితిన్‌ను పెళ్లి రోజు కూడా వదల్లేదు. దీంతో ‘త‌న‌కు పెళ్లి అని చూడ‌కుండా కొంద‌రు టార్చర్‌ పెడుతున్నారు’ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశాడు నితిన్.

ఇంతకీ మ్యాటరేంటంటే.. నితిన్, కీర్తి సురేష్‌లు జంటగా ‘రంగ్ దే’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి వెంకీ అట్లూరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, నితిన్ పెళ్లి కానుకగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘పెళ్లి కొడుకు ఎవరు?’ అన్న డైలాగ్‌తో టీజర్ మొదలవగా, నితిన్ ఫేస్ రివీల్ కాగానే.. ‘ఇతనే నా బాయ్ ఫ్రెండ్.. వెరీ క్యూట్’ అంటూ మహానటి కీర్తి ముద్దులు పెడుతుంది. దానికి వెంటనే నితిన్ .. ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదంటాడు. ఇక ఈ సినిమా పెళ్లి నేపథ్యంలోనే తీసినట్లుగా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కీర్తి నితిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. ‘నాన్నా.. త‌ను న‌వ్వుతుంది నేను క‌ట్ట‌లేను నాన్నా..’ అంటూ నితిన్ ఎంతో క్యూట్‌గా చెబుతున్న డైలాగ్ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక చివర్లో నితిన్ పాత్రలు తోముతూ ఉంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘బస్టాండే.. బస్టాండే.. ఇక నీ బతుకు బస్టాండే..’ అంటూ ట్రైలర్ ముగించారు. చివర్లో ‘హ్యపీ మ్యారీడ్ లైఫ్ నితిన్’ అని చిత్ర బృందం తెలియజేసింది. కాగా, ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వడం కోసం ‘నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా కూడా డ‌బ్బింగ్ చెప్పానని’ నితిన్ తెలిపారు. అందుకు ద‌ర్శకుడు వెంకీ అట్లూరి నితిన్‌కు థాంక్స్ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed