‘యానిమల్’లో రణ్‌బీర్ రఫ్ క్యారెక్టర్

by Shyam |
‘యానిమల్’లో రణ్‌బీర్ రఫ్ క్యారెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అర్జున్ రెడ్డి(కబీర్ సింగ్) సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ తర్వాతి ప్రాజెక్ట్ రణ్‌బీర్ కపూర్‌తో కన్‌ఫర్మ్ అయింది. ‘యానిమల్’ టైటిల్ పోస్టర్ రివీల్ చేస్తూ 2021లో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన టీమ్.. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధానపాత్రల్లో నటించబోతున్నట్లు ప్రకటించింది. ఇక రణ్‌బీర్‌తో రొమాన్స్ చేసే చాన్స్ పరిణీతి చోప్రా కొట్టేసింది. టి సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హిందీలో షాహిద్ కపూర్‌తో సందీప్ వంగ చేసిన కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి) రీమేక్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. యానిమల్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ‘యానిమల్’ మూవీ యూనిట్ షేర్ చేసిన స్నీక్ పిక్‌ విజిల్‌తో స్టార్ట్ కాగా.. ఇందులో రణ్‌బీర్ తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. వచ్చే జన్మలో తండ్రి తనకు కొడుకుగా పుడితే.. అప్పుడు తనలా కాకుండా నీలా ప్రేమగా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యాడు. ఒక్క నిమిషం నిడివిగల వీడియో తుపాకీ కాల్పుల శబ్ధంతో ఎండ్ కాగా.. రణ్‌బీర్ చాలా రఫ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది.

Advertisement

Next Story