ఆ షో వల్లే హీరోయిన్ల ఫ్యాన్స్ నాపై తిరగబడ్డారు : హీరో

by Jakkula Samataha |   ( Updated:2023-03-24 17:20:53.0  )
Ranbir Kapoor
X

దిశ, సినిమా : ‘కాఫీ విత్ కరణ్ షో’ సీజన్ 3 తన లైఫ్‌లో చాలా నెగెటివిటీని తీసుకొచ్చిందన్నాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ సోనమ్ కపూర్, దీపికా పదుకొనే గెస్ట్‌లుగా వచ్చిన షోలో తన గురించి, తన క్యారెక్టర్ గురించి మాట్లాడిన మాటలు చాలా ప్రతికూలతను తీసుకొచ్చాయన్నాడు. 2013లో ‘బేషరమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రణ్‌బీర్‌ను ఓ అభిమాని ‘కాఫీ విత్ కరణ్ షో’కు గెస్ట్‌గా వెళ్లాల్సి వస్తే ఏ స్టార్‌తో వెళ్తావని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన రణ్‌బీర్.. ఈ షో ఆల్రెడీ తన జీవితంలో చెప్పలేనంత నెగెటివిటీని తీసుకొచ్చిందన్నాడు. సోనమ్, దీపికల ఫ్యాన్స్ తనను ఒక విలన్‌గా చూడడం మొదలెట్టారని తెలిపాడు. అయితే తను చేసే పనులు, సినిమాల ద్వారా మళ్లీ వారి మనసును గెలుస్తాననే నమ్మకం ఉందన్నాడు రణ్‌బీర్.

Advertisement

Next Story