- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టులోనే ‘రానా వెడ్స్ మిహికా’
లాక్డౌన్ టైమ్‌లో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా.. అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. తన ప్రేమకు మిహికా బజాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరువైపుల కుటుంబాలు కలిసి వీరికి ‘రోకా’ ఫంక్షన్ కూడా నిర్వహించారు. ఇక రానా-మిహికాల పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందని రానా తండ్రి సురేష్ బాబు చెప్పేయడంతో డిసెంబర్లో పెళ్లి జరుగుతుందని అంతా ఊహించారు. కానీ ఆగస్టులోనే రానా.. మిహికా మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో కొద్ది మంది బంధువుల మధ్యే పెళ్లి చేసుకుంటారా లేక విదేశాల్లో పెళ్లి జరుపుతారా ? అన్న విషయంలో క్లారిటీ లేదు.
ఇటీవలే రానా పెళ్లి గురించి సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ వల్ల పెళ్లి పనులకు టైమ్ దొరికింది. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం. ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో మ్యారేజ్‌కు సంబంధించిన ఫంక్షన్ ఉంటుంది. ఈ శుభకార్యానికి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తాం’ అని చెప్పారు. ఇటీవల మంచు లక్ష్మీతో ఇన్‌స్టా లైవ్ చాటింగ్‌లో పాల్గొన్న రానా తన ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై సమాధానిమిచ్చారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ ‘రోకా వేడుకకు పిలవలేదు. కనీసం పెళ్లికైనా నీ స్నేహితులను పిలుస్తావా..? అంటూ ప్రశ్నించింది. దానికి రానా.. ‘అప్పటి పరిస్థితులను బట్టి పిలుస్తా. ఒకవేళ అప్పుడు కూడా ఇప్పటి పరిస్థితులే ఉన్నట్టయితే ఫొటోలు పంపిస్తా చూడండి’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.