- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు రుణపడి ఉండే రానా.. రిపబ్లిక్ డే స్పెషల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హీరో రానా దగ్గుబాటి..సైనికులకు సెల్యూట్ చేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ఈ రిపబ్లిక్ డే మన దేశ సాయుధ దళాల పట్ల నూతన గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నాడు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని మురార్ పోస్ట్ దగ్గర దేశ సరిహద్దు భద్రతా దళాలతో గడిపినప్పటి నుంచి ఈ భావన తనతో ఉందని తెలిపాడు. దేశానికి సేవ చేసేందుకు సైనికులు ఎంత దూరం వెళుతున్నారో పౌరులుగా మనకు తెలియదని..డిస్కవరీ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మిషన్ ఫ్రంట్‌లైన్’ డాక్యుమెంటరీ కోసం బీఎస్‌ఎఫ్‌తో గడిపిన కొంత సమయం ఈ విషయం తనకు తెలిసేలా చేసిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జవాన్లతో కలిసి శిక్షణ తీసుకునే అవకాశం లభించినందుకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. వారిలో ఒకరిగా భావించి శిక్షణ యొక్క ప్రతి దశలో తనను ఎంకరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. బీఎస్ఎఫ్‌లో భాగం అయ్యేందుకు శారీరక, మానసిక, భావోద్వేగ పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నానన్న రానా..ఒత్తిడి ఉన్నా క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న జవాన్లకు థాంక్స్ చెప్పాడు.
దేశానికి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ప్రత్యర్థుల నుంచి రక్షించేందుకు సైనికులు బార్డర్‌లో నిలబడి ఉన్నారని..మనం మన ప్రియమైన వారితో ఆనందంగా గడిపేందుకు, వారు వారి కుటుంబాన్ని వదిలేసి కాపలా కాస్తున్నారని వివరించాడు. మండుతున్న ఎండలో, వణికే చలిలో శిక్షణ తీసుకుంటారని, శత్రువులతో పోరాడుతారని…వారు చేసే త్యాగాల వల్లే మనం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాడు. మరణించే వరకు విధులు నిర్వహించాలన్న మోటోతో పనిచేస్తూ దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు పాటుపడుతున్న జవాన్లు తన హృదయాన్ని గర్వంతో నిండిపోయేలా చేశారన్నాడు. మీకెప్పుడూ రుణపడి ఉండే మీ రానా అంటూ..జవాన్లకు సెల్యూట్ చేశాడు.