- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రానా, మిహికాకు తారల విషెస్
దిశ, వెబ్ డెస్క్: రానా, మిహికలు పెండ్లి పీఠలు ఎక్కే శుభ సమయం మరికొన్ని గంటల్లో రానుంది. దీంతో ఇరు కుటుంబాలు పెండ్లి సందడిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. గురువారం హాల్దీ వేడుకగా జరగగా, రానా కాబోయే శ్రీమతి మిహికా పసుపు లెహాంగాలో ఆకట్టుకోగా, రానా పంచె కట్టులో సూపర్‌గా కనిపించాడు. హల్దీ వేడుకలో భాగంగా నిర్వహించిన ఫొటో షూట్‌లో ఇద్దరూ మెరిసిపోయారు.
మిహికా వెన్నెల నవ్వుల్లు కురిపిస్తూ..రానాను చూస్తుండగా.. దానికి రానా చిరునవ్వులతో సిగ్గుపడిపోతూ కనిపించాడు. ఆ ఫోటోను ఇన్‌స్టా వేదికగా రానా తన అభిమానులతో పంచుకున్నాడు.‘నవ్వులతో జీవితం ముందుకు సాగిపోతోంది… థ్యాంక్యూ లవ్’ అంటూ తన మనసులోని భావాన్ని ఆ ఫొటోకు జతపర్చాడు. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ కాగా,సెలెబ్రిటీలంతా… రానా, మిహికాకు విషెస్ చెప్పారు.
‘జీవితాంతం మీ జంట ఇలానే సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను’ – కాజల్ అగర్వాల్
‘మీరిద్దరూ.. ఎప్పుడూ.. అమితమైన ప్రేమలో ఉండండి’- అమలాపాల్
‘మీరిద్దరూ లైఫ్‌టైమ్ ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ – శృతిహాసన్
‘స్టన్నింగ్… మీరిద్దరూ చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. లుక్ డివైన్’ – శ్రీయ సరన్
‘రానా బాయ్ … సో సో హ్యాపీ ఫర్ యూ’ – శ్రీయ రెడ్డి
‘హ్యాపినెస్.. లవ్ అండ్ మ్యాడ్ యూ టూ ’ – లక్ష్మీ మంచు
‘కంగ్రాట్యులేషన్స్ ’ – లక్ష్మీరాయ్
రేపు (ఆగస్టు 8- శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా సమయంలో జరుగుతున్న పెండ్లి కావడంతో ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. సర్కారు నిబంధనల ప్రకారమే ఈ పెండ్లి జరగనుంది. అతిథులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించడంతోపాటు, చెఫ్‌లు, సర్వర్‌లను కూడా పరీక్షిస్తున్నామని నిర్మాత సురేష్ వెల్లడించారు.
View this post on InstagramAnd life moves fwd in smiles 🙂 Thank you ❤️
A post shared by Rana Daggubati (@ranadaggubati) on