- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రేపే రంజాన్ నెల ప్రారంభం
దిశ, న్యూస్ బ్యూరో:
రంజాన్ మాసం ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ నెల 23న సాయంత్రం నెలవంక కనిపించడంతో మరుసటి రోజు నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నట్టు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించాయి. ఈ రెండు దేశాలతో పాటు కతార్, ఇండోనేషియా, సిరియా, లెబనాన్, మొరాకో తదితర దేశాల్లోనూ శుక్రవారం నుంచే రంజాన్ మాసం ప్రారంభమవుతోంది. కేరళలోని కోజికోడ్‌లోనూ నెలవంక కనిపించడంతో ఆ రాష్ట్రంతో పాటు కర్నాటకలో కూడా రంజాన్ మాసం 24 నుంచే మొదలవుతోంది. తెలంగాణలో మాత్రం 25వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
ఈసారి కరోనా కారణంగా వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు లేనందున రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఇళ్ళల్లోనే జరగనున్నాయి. వచ్చే నెల 23వ తేదీన జరగనున్న రంజాన్ పండుగ నాటికి ఆంక్షల్లో సడలింపు ఉంటే మసీదుల్లో ప్రార్థనలు జరిగే అవకాశం ఉంది, లేదంటే ఇళ్ళల్లోనే జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే ఇఫ్తార్ విందుతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇచ్చే ఇఫ్తార్ విందులు సైతం ఈసారి అనుమానమే.
Tags: Ramzan, Telangana, Corona, Masjid, Mosque