‘రామ్ సేతు’ షూటింగ్ షురూ.. అక్షయ్ క్లాసీ లుక్

by Shyam |
Ramsetu shoot begins
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రజెంట్ హిస్టారికల్ సబ్జెక్ట్స్‌పై దృష్టి పెడుతోంది. చారిత్రాత్మక కథలను పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది. ‘బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్, రామ్ సేతు’ ఈ కోవలోనివే. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ హీరో‌హీరోయిన్లుగా ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ‘రామ్ సేతు’ సైతం చారిత్రక నేపథ్యమున్న కథాంశమే. ఇందులో అక్కి ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు (మంగళవారం) అయోధ్యలో షురూ అయింది. తన లుక్‌ను ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు అక్షయ్.

రామాయణం ఆధారంగా రామసేతు నిర్మాణం, రామజన్మభూమి గురించి రీసెర్చ్ చేసే ఆర్కియాలజిస్టుగా అక్షయ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారత్-శ్రీలంకను కలుపుతూ నిర్మించిన రామసేతు(వారధి)పై శాస్త్రీయ పరిశోధన నేపథ్యంలో స్టోరీ ఉంటుందని టాక్. అభిషేక్ శర్మ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుజ్రత్ నటిస్తున్నారు. అక్షయ్ ఆర్కియాలజిస్ట్(పురావస్తు శాస్త్రవేత్త) లుక్‌ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Advertisement

Next Story