- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్దెకు రామోజీ ఫిల్మ్‌సిటీ !
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపార దిగ్గజం రామోజీరావు కలల సౌధం ‘రామోజీ ఫిల్మ్‌సిటీ’ని అద్దెకు ఇచ్చారు. అవును ! ఈ వార్త వినేందుకు కొంచెం ట్విస్టింగ్‌గా అనిపించినా మీరు చదువుతున్నది నిజమే. ప్రపంచంలో అతి పెద్దదైన ఈ ఫిల్మ్‌సిటీ.. గిన్నీస్ బుక్ రికార్డును సైతం సొంతం చేసుకుంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ షూటింగ్‌లతో పాటు మరెన్నో వినోద కార్యక్రమాలకు ఈ ఫిల్మ్‌సిటీ కేరాఫ్. దీంట్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేసి తమ కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ ఫిల్మ్‌సిటీ కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. దాదాపు 4నెలల నుంచి షూటింగ్‌లు బంద్ కావడంతో ఫిల్మ్ సిటీలో కార్యకలాపాలు మొత్తం బంద్ అయ్యాయి. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు 60శాతం వరకు నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సిన వాళ్లను మాత్రమే ఉద్యోగానికి పిలుస్తూ వారికే జీతాలు చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారని టాక్.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ విజృంభణ, అంతేగాక సినిమా షూటింగ్‌ల ప్రారంభానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న షోలు, టీవీ సీరియళ్లకు అనుమతులు వచ్చినా వాటితో ఇంత పెద్ద ఫిల్మ్ సిటీని నెట్టుకు రావడం కష్టంగా మారడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఫిల్మ్‌సిటీని మొత్తాన్ని ‘హాట్ స్టార్- డిస్నీ’కి అద్దెకు ఇచ్చారని రిపబ్లిక్ వరల్డ్ కథనం రాసింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే అద్దెకు తీసుకున్న హాట్ స్టార్ డిస్నీ సంస్థ ఇతర నిర్మాణ సంస్థల షూటింగ్‌లకు అనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్లు తెలిపిందని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ రామోజీ ఫిల్మ్‌సిటీని చేతిలో పెట్టుకోవడం ద్వారా వచ్చే రోజుల్లో సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌తో పాటు ఇతర కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఇతరుల కంటే మెరుగైన పొజిషన్‌లో ఉంటామని ఆ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
గతేడాది హాట్‌స్టార్, డిస్నీ టై అప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ‘హాట్‌స్టార్ అత్యంత శక్తివంతమైన ఓటీటీ సంస్థగా అవతరించింది. ఇదిలా ఉంటే వరల్డ్‌లోనే అతిపెద్ద బ్రాండ్ అయిన డిస్నీ.. ఫిల్మ్‌సిటీని పర్యాటకపరంగా, సినిమా, షూటింగ్‌ల కోసం ఉపయోగించుకోనున్నట్లు అర్థమవుతోంది. కరోనా వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు షూటింగ్‌లు అంతంత మాత్రంగా సాగుతాయి. తర్వాత కూడా కొన్ని నెలలు పాటు కరోనా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని భావించిన యాజమాన్యం ఆర్థిక పరమైన అంశాలను లెక్కలోకి తీసుకొని ఫిల్మ్‌సిటీని హాట్‌స్టార్ డిస్నీకి అప్పగించి సేఫ్‌జోన్‌లోకి వెళ్లిందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టులో వచ్చే రోజుల్లో ఏవేవి మార్పులు చోటు చేసుకుంటాయనేది ముందు ముందు చూడాల్సిన అంశమే.