మాటల మాంత్రికుడి డైరెక్షన్‌లో మెగా హీరో?

by Jakkula Samataha |   ( Updated:2021-01-15 06:34:31.0  )
మాటల మాంత్రికుడి డైరెక్షన్‌లో మెగా హీరో?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, RRR సినిమాలతో బిజీగా ఉన్న చరణ్‌కు ఇప్పటికే వెంకీ కుడుముల స్టోరీ వినిపించాడని టాక్ వచ్చినా..‘మాస్టర్’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రఫ్‌గా ఓ లైన్ చెర్రీకి చెప్పాడని వార్తలొచ్చినా.. వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెర్రీ కోసం ఓ స్క్రిప్ట్ రాశాడని ఇండస్ట్రీ టాక్. సూపర్ కంటెంట్‌కు ఇంప్రెస్ అయిన మెగా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రకటించిన సినిమా ఈ ఏడాది పూర్తి కానుందని.. ఆ తర్వాత చరణ్‌తో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇయర్ ఎండింగ్‌లో మూవీ ప్రారంభం అయ్యే చాన్స్ ఉండగా.. తొందర్లోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా, కొవిడ్ నుంచి కోలుకున్న చెర్రీ..త్వరలో ‘ఆచార్య’ టీంతో జాయిన్ కానున్నాడు. నెలరోజుల పాటు జరిగే లాంగ్ షెడ్యూల్‌లో తన పోర్షన్ కంప్లీట్ చేయనున్నాడట.

Advertisement

Next Story