రామరాజు ఫర్ భీమ్.. తారక్‌కు చెర్రీ గిఫ్ట్ రెడీ!

by Shyam |
రామరాజు ఫర్ భీమ్.. తారక్‌కు చెర్రీ గిఫ్ట్ రెడీ!
X

దిశ, వెబ్ డెస్క్:
భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ గురించి చెప్పినట్లుగానే అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. తారక్, చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడగా.. షూటింగ్ మళ్లీ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన జక్కన్న అండ్ టీమ్.. త్వరలో మంచి బహుమతి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

https://twitter.com/RRRMovie/status/1313343226531647491?s=19

‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పుట్టినరోజున తారక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసి అటు అభిమానులకు ఇటు చరణ్‌కు గొప్ప బహుమతి అందించగా.. తారక్ బర్త్‌డే రోజున మాత్రం అలాంటి బహుమతి ఇవ్వలేకపోయారు చరణ్. ఆ టైమ్ ఇప్పుడు వచ్చిందని.. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉత్తమ బహుమతి అందిస్తానని చెప్పాడు చెర్రీ. అక్టోబర్ 22న కానుక అందుకునేందుకు సిద్ధంగా ఉండాలని తారక్‌కు సూచించాడు.

భీమ్ ఫర్ రామరాజు వీడియోలో చరణ్ లుక్ అదిరిపోగా.. తారక్ వాయిస్ అంతకన్నా గొప్పగా మెస్మరైజ్ చేసింది.. చెర్రీ లుక్‌లో ఉన్న ఇంటెన్సిటీని పెంచింది. మరి ‘రామరాజు ఫర్ భీమ్’ అంతే ఇంప్రెస్ చేస్తుందా? అసలే కోపంగా ఉన్న తారక్ అభిమానులను మెప్పిస్తుందా? చూడాలి.

కాగా ఈ ప్రకటన చేసేందుకు రిలీజ్ చేసిన వీడియోలో తారక్, చరణ్‌లు కలిసి నటిస్తున్న చిన్న గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సీన్‌లో చరణ్ గుర్రంపై వెళ్తుండగా.. బైక్‌పై వార్‌కు సిద్ధం అయ్యాడు తారక్. కొమురభీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మోస్ట్ అవేయిటెడ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ మళ్లీ సెట్స్ మీదకి వెళ్లడంపై ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story