డియర్ పవన్… జాగ్రత్త: రమణ గోగుల

by Shyam |
డియర్ పవన్… జాగ్రత్త:  రమణ గోగుల
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చాలా సినిమాలకి రమణ గోగుల సంగీత దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. బద్రి, తమ్ముడు, జానీ సినిమాలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. ఐతే జానీ సినిమా రిలీజ్ అయి 17 ఏళ్లు అవుతుండగా … పవన్ తో పనిచేయడం పై ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు రమణ గోగుల.

ప్రియమైన పవన్… “జానీ” సినిమా మ్యూజిక్ గురించి నిన్ననే కూర్చుని మాట్లాడుకున్నట్లు ఉందని… కానీ నమ్మలేకపోతున్నాను… అప్పుడే 17 ఏళ్లు పూర్తి అయ్యాయి అని తెలిపాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన ప్రయాణం… ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు రమణ గోగుల.

కాగా జానీ సినిమాకు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా… తన మాజీ భార్య రేణు దేశాయ్ హీరోయిన్ కాగా పవన్ హీరో. పవన్, రేణు కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో “జానీ” రెండోది కాగా… తొలి సినిమా “బద్రి”.


Tags: Johnny, Pawan Kalyan, Ramana Gogula, Music Director, Tollywood, Renu Desai

Advertisement

Next Story