ఆర్ఎఫ్‌సీఎల్ ట్రయల్ రన్ స్టార్.. మరో నెలలో ఉత్పత్తి

by Shyam |   ( Updated:2023-12-16 14:46:39.0  )
ఆర్ఎఫ్‌సీఎల్ ట్రయల్ రన్ స్టార్.. మరో నెలలో ఉత్పత్తి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్ కార్పోరేషన్ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో యూరియా ప్లాంట్‌లో తెల్లవారు జామున 2.30 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మరి కొద్ది రోజుల్లో ఇక్కడ యూరియా ప్రొడక్షన్ ఆరంభించనున్నారు. అమ్మోనియం ప్లాంట్‌లో కూడా ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ర్తిగా గ్యాస్ ఆధారిత ప్లాంట్ నిర్మాణం చేసిన తర్వాత దీన్ని 2017 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడి గజ్వెల్ లో శంకుస్తాపన చేశారు. యూరియా ప్లాంట్ ట్రయల్ రన్‌ను సీఈఓ నిర్లిప్ సింగ్, జీఎం‌వీ. కె బంగారులు ప్రారంభించారు. రోజుకు 3150 టన్నుల యూరియా, 2200 టన్నుల అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. రూ. 6160 కోట్లతో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి

Advertisement

Next Story