- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి ఇంట్లోనే రంజాన్ !
– సామూహిక ప్రార్థనలపై కరోనా ప్రభావం
– ఆలింగనాలు, జుమ్మాలకు లాక్‌డౌన్ అడ్డంకి
– ఇండ్లల్లోనే జరుపుకోవాలని కోరిన కేంద్రం, ముస్లిం పెద్దలు
దిశ, న్యూస్‌బ్యూరో: నాలుగు రోజుల్లో ప్రారంభమవనున్న రంజాన్ మాసంపై కరోనా ఫ్రభావం పడింది. ముస్లింలకు ఇది పవిత్ర మాసం. నియమ నిష్టలతో ఉపవాసం ఉంటారు. శుభ్రతను పాటిస్తూ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. అయితే ఈసారి ఆ సంప్రదాయానికి, ఉత్సాహానికి కరోనా కారణంగా వచ్చిన ‘లాక్‌డౌన్’ అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. మే 3 వరకూ లాక్‌డౌన్ విధించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్‌లో జామియా నిజామియా సంస్థ కూడా ముస్లింలు రంజాన్ మాసాన్ని ఇంట్లోనే నిర్వహించుకోవాలని, ప్రార్థనల కోసం మసీదులకు వెళ్ళొద్దని కోరారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ముస్లింలకు ఇదే తీరులో పిలుపునిచ్చారు. మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ ఎత్తివేయడంపై ఇంకా స్పష్టత లేదు. అప్పటివరకూ రంజాన్ వేడుకలు ఇండ్లలోనే.
ఈ సంవత్సరం ఏప్రిల్ 23న రంజాన్ మాసం ప్రారంభమవుతోంది. వచ్చే నెల 23 వరకూ ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వేకువ జామున మేల్కొని నిర్ణయించిన సమయంలో సహర్, ఇఫ్తార్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సమయంలో మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే స్నానం మొదలు పవిత్రంగా, శుభ్రతను పాటిస్తారు. ఏడాదంతా నమాజ్ చేసినా చేయకపోయినా, రంజాన్ నెలను పాటించేవారు ప్రతీ రోజూ ఐదు సార్లు మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. మహిళలైతే అదే సమయంలో ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకుంటారు. మసీదుల్లో సామూహికంగా ప్రార్థనలు చేయడం, ఆలింగనాలు నిత్యం కనిపించే దృశ్యాలు. అనంతరం అందరూ తెచ్చుకున్న ఆహార పదార్థాలు, పండ్లను పంచుకుని తింటుంటారు.
వివిధ రాజకీయ పార్టీల నాయకులు సైతం మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇఫ్తార్ విందు ఇస్తారు. ప్రభుత్వం కూడా అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే వీటన్నిటికీ ఈ ఏడాది కరోనా బ్రేక్ వేసింది. కరోనా నివారణకు సామాజిక దూరాన్ని పాటించడం కీలకంగా మారింది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి అన్ని మతాల ప్రార్థనాలయాలను మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. జనసమ్మర్ధం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మర్కజ్ వెళ్లొచ్చినవారిలో కరోనా బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఈ మాసంలో జరిగే సామూహిక ప్రార్థనలు, భోజనాల్లో ఉంటే వైరస్ ఎవరికైనా ఉంటే అది వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ముస్లిం సంస్థలు, పెద్దలు కూడా రంజాన్ ప్రార్థనలు, విందులను ఇండ్లకే పరిమితం చేయాలని కోరారు. సామూహిక ప్రార్థనలు వద్దన్న కేంద్ర ప్రభుత్వం కరోనాను నివారించడంలో భాగంగా లాక్‌డౌన్ విధించింది. సామాజిక దూరాన్ని అమలు చేయడంలో భాగంగా అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను మూసివేసింది. ముస్లిం సోదరులు కూడా రంజాన్ మాసాన్ని సామాజిక దూరం పాటిస్తూ జరుపుకోవాలని కేంద్రప్రభుత్వం కోరింది.
ఇప్పటికే దేశంలోని అన్ని వక్ఫ్ బోర్డులకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దానికి ముందు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వివిధ రాష్ట్రాల వక్ఫ్ బోర్డు ప్రతినిధులతో మాట్లాడి ఇళ్ళలోనే రంజాన్ వేడుకలను జరుపుకునే విధంగా అర్థం చేయించి ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. రంజాన్ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు ప్రయత్నించి, కరోనా వైరస్ వ్యాపించేందుకు అవకాశం ఇవ్వొద్దని కేంద్రం సూచించింది. అన్ని మత సంస్థలు, ఆలయాలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. లాక్‌డౌన్ ముగిసేవరకూ ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి ముస్లిం సోదరులు కూడా సామూహికంగా మసీదుల్లో కాకుండా ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని, రంజాన్ నెలను పవిత్రంగా జరుపుకోవాలని కోరింది.
ఇంట్లోనే జరుపుకోవాలని కోరిన మత పెద్దలు
కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా రంజాన్‌ను ఇంటివద్దనే నిర్వహించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సంస్థలు, పెద్దలు కోరారు. ఉపవాస దీక్షలను ఇంట్లోనే జరుపుకోవాలని, మసీదులకు వెళ్లే పరిస్థితి లేదని సౌదీ అరేబియా మత పెద్ద గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్ధుల్ అజీజ్ షేక్ తెలిపారు. మదీనాలో ప్రతీ రోజూ ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులను కూడా రద్దు చేసినట్టు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన జామియా నిజామియా అనే సంస్థ కూడా రంజాన్ దీక్షలను ఇంట్లోనే జరుపుకోవాలని కోరుతూ ఫత్వా జారీ చేసింది. వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారించేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని సంస్థ ఆ ప్రకటనలో కోరింది. ఈ సంస్థ జారీ చేసిన ఫత్వాను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ట్విట్టర్ ఖాతాలో జత చేశారు. అందరూ ఈ నిబంధనలను పాటించాలని, కరోనా నివారణలో భాగస్వాములు కావాలని ఆయన ట్విట్టర్‌లో కోరారు.
tags: Ramzan, Telangana, Corona, WAKF Board, LockDown, Twitter, Owaisi