ఆర్టీఏ కమిటీ సభ్యుడిగా రామారావు

by Sridhar Babu |   ( Updated:2020-05-17 03:33:08.0  )
ఆర్టీఏ కమిటీ సభ్యుడిగా రామారావు
X

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా రవాణా శాఖ కమిటీ సభ్యుడిగా వల్లభనేని రామారావు నియామ‌కం అయ్యారు. ఆదివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా రామారావు నియామక పత్రాన్ని అందుకున్నారు. రవాణా శాఖ అందిస్తున్న వివిధ సేవలను విస్తృత పరిచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని ఈ సంద‌ర్బంగా రామారావుకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్టీవో కిషన్ రావు, అదనపు ఎంవీఐ కిశోర్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story