తెలంగాణ ఉద్యమానికి మద్దతు

by Shamantha N |
తెలంగాణ ఉద్యమానికి మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమానికి రాంవిలాస్ పాశ్వాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని సందర్భాల్లో ఉద్యమ వేడి ఢిల్లీకి తాకినప్పుడు జాతీయ స్థాయిలో ఆయన పెద్ద దిక్కుగానే వ్యవహరించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెయ్యి కార్లతో ర్యాలీ జరిగినప్పుడు రాంలీలా మైదానం దగ్గర స్వాగతం పలికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో నాణ్యమైన బియ్యం పెట్టడానికిన అవసరమైన కోటాను పెంచాల్సిందిగా తెలంగాణ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Next Story