- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రే కాదు… బాబాయి సినిమాలోనూ అబ్బాయి
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” సినిమా చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజుగా ఈ చిత్రం నుంచి విడుదలైన చెర్రీ ఫస్ట్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా పూర్తైన వెంటనే చరణ్… మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న “ఆచార్య” సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న “ఆచార్య” చిత్రంలో చిరును ఇన్స్‌పైర్ చేసే పాత్రలో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే… మరో న్యూస్ హల్ చల్ చేస్తుంది. తండ్రి సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్న చరణ్…. బాబాయి సినిమాలోనూ స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. క్రిష్ డైరెక్షన్‌లో పిరియాడికల్ మూవీకి ప్లాన్ చేశాడు పవన్. తెలంగాణలో ఆంగ్లేయుల పాలనకాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో పవన్ రాబిన్ హుడ్ మాదిరి క్యారెక్టర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపబోతుండగా… చరణ్ కూడా ఈ చిత్రంలో ఓ లీడ్ రోల్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఇదే టాపిక్‌పై ఫిల్మ్ నగర్‌లో చర్చ నడుస్తుండగా.. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Tags: RamCharan Tej, RRR, Acharya, Chiranjeevi, Pawan Kalyan