నానమ్మ దగ్గర చెర్రీ ట్రైనింగ్

by Shyam |
నానమ్మ దగ్గర చెర్రీ ట్రైనింగ్
X

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య సతీమణి ఉపాసనకు సరదాగా డిన్నర్ చేసిన చరణ్… తాజాగా #betheREALMAN చాలెంజ్ లో భాగంగా ఇంటి పనులు కూడా చేసి అభిమానులకు మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.

ఇప్పుడు నానమ్మ తో కలిసి మరో కొత్త విషయం నేర్చుకున్నాడు చెర్రీ. అమ్మ, నానమ్మ కలిసి వెన్నె తీస్తుండగా అక్కడికి చేరుకున్న చరణ్…. స్వచ్ఛమైన వెన్నెను ఎలా తీయాలో నానమ్మ దగ్గర సమ్మర్ క్లాస్ తీసుకున్నాడు. ఈ క్రమంలో నానమ్మ చెర్రీకి బెస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. కన్నా… కృష్ణుడిలా కనిపిస్తున్నావు రా అంటూ మనవడిని మెచ్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న చెర్రీ… తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరు ఆచార్య సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.

Tags: Ram Charan Tej, Grand Mother, Mother, Charan, RRR, Acharya

Advertisement

Next Story