కరోనా టైంలో పోలీసుల పనితీరు భేష్ : చరణ్

by Shyam |
కరోనా టైంలో పోలీసుల పనితీరు భేష్ : చరణ్
X

దిశ, సినిమా: కరోనా సమయంలో పోలీసుల పనితీరును అభినందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జరిగిన స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన ఆయన.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పోలీసు కథలంటే ఇష్టమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సజ్జనార్.. నాలుగు రోజులుగా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. చరణ్ నటించిన ‘మగధీర’ ‘ధృవ’ ‘రంగస్థలం’ సినిమాలు చూశానని తెలిపిన ఆయన.. ప్లాస్మా ద్వారా ఎనిమిది వేల మంది ప్రాణాలు కాపాడగలిగామని వివరించారు. కార్యక్రమానికి హాజరైన రాం చరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్‌కు ధన్యవాదాలు తెలిపారు సజ్జనార్.

Advertisement

Next Story