- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరుతో చరణ్.. ఫ్యాన్స్‌కు పండగే
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో ‘ఖైదీ నం.150’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమాను నిర్మించి భారీ లాభాలు అందుకున్నాడు. తర్వాత చిరు 151వ సినిమా సైరా నర్సింహారెడ్డి పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ చిత్రానికి కూడా చెర్రీనే ప్రొడ్యూసర్. అయితే సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట చిరు, చరణ్ లు.
దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం నేపథ్యంలో సాగే సినిమాకు ‘ఆచార్య’ అనే పేరు టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో చరణ్ కూడా నటించబోతున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. దాదాపు 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో సిద్ధుగా కనిపించబోతున్నాడట చరణ్. ఈ రోల్ సినిమాకు కీలకం కాగా ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్నాడు చెర్రీ.