మెగా అల్లుడికి బిగ్ వెల్‌కమ్

by Shyam |
మెగా అల్లుడికి బిగ్ వెల్‌కమ్
X

సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో … విజయ్ సేతుపతి కీలకపాత్ర చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కతుతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.

మహా శివరాత్రిని పురస్కరించుకుని ‘ఉప్పెన’ చిత్ర యూనిట్ న్యూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో క్యూట్ పెయిర్‌గా కనిపిస్తున్నారు కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్. బిగ్ వెల్‌కం వైష్ణవ్ తేజ్ .. నువ్వు ఈ సినీ ప్రయాణాన్ని ప్రేమిస్తావు… ఈ రంగంలో పూర్తిస్థాయిలో రాణిస్తావు అంటూ ట్వీట్ చేశారు. మరి ఉప్పెనలా దూసుకొస్తున్న వైష్ణవ్ బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో ముంచుతాడనే ఆశిద్దాం.

Advertisement

Next Story

Most Viewed