చెర్రీ ‘అలియా’స్ 'ఆర్ఆర్ఆర్'

by Shyam |   ( Updated:2020-02-18 02:27:24.0  )
చెర్రీ ‘అలియా’స్ ఆర్ఆర్ఆర్
X

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘బాహుబలి’ సినిమాలో బాహుబలిని చంపింది ఎవరు? ప్రశ్నకు ఎంత క్రేజ్ ఉండేదో అంతకు మించిన క్రేజ్ ఉంది ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్‌‌కు. ఒక రోజు జక్కన్న సినిమాలో తారక్ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తారట అని న్యూస్ వస్తే… మరోరోజు ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేస్తారట అంటూ మరో న్యూస్. తాజా వార్త ఏంటంటే… సినిమాలో రామ్‌చరణ్, అలియా భట్ లుక్స్ పై చర్చ.

ఈ క్రమంలోనే చెర్రీ, అలియాల ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. బ్రిటీష్ సైనికాధికారి డ్రెస్‌లో చరణ్ కనిపిస్తుండగా సీతామాలక్ష్మి గెటప్‌లో అలియా ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో వీరిద్దరి లుక్స్ ఇవే అంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా బ్రిటీషియన్ డ్రెస్‌ ఎందుకు వేసుకుంటాడు? ఇదంతా అబద్ధపు ప్రచారం అని కొట్టిపారెస్తున్నారు. అంతేకాదు అలియా భట్ గంగూభాయి చిత్రంలోనిదే ఆ ఫోటో అంటూ మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి ఫ్యాన్ మేడ్ పిక్స్‌తో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలుసుకోవడం కష్టమే అవుతుంది.

Advertisement

Next Story