మురికి వాడల కుటుంబాలకు హోంఫుడ్ అందిస్తున్న రకుల్

by Shyam |
మురికి వాడల కుటుంబాలకు హోంఫుడ్ అందిస్తున్న రకుల్
X

దిశ వెబ్ డెస్క్ :
కరోనా కారణంగా… ఎంతోమంది జీవనాధారాన్ని కోల్పోయారు. దాంతో తమకు కడుపు నిండా తిండి కూడా దొరకడం లేదు. ఇలాంటి ఆపత్కాలంలో.. అలాంటి వారికి తన వంతు సాయం చేస్తూ.. అందరికీ ఆదర్మంగా నిలుస్తోంది.. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్. కరోనా వేళ.. హీరోయిన్లు ఎవరూ కూడా స్పందించడం లేదంటూ.. పలువురు నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. అయితే దానం అనేది చెప్పి చేసేది కాదు.. ఎవరికీ తోచినట్లు వాళ్లు సాయం చేస్తుంటారు. రకుల్ కూడా అదే చేసింది. మాట్లాడే పెదాల కన్నా .. సాయం చేసే చేతులు మిన్న అనే మాటను రకుల్ నిజం చేసి చూపింది.

సినీ పరిశ్రమలోని చాలా మంది తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇంకెంతోమంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మరికొందరు ఆహారం పంపిణి చేస్తున్నారు. శానిటైజర్లు, మాస్క్ లు పంచి పెడుతున్నారు. రకుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గుర్గావ్ లోని తన ఇంటికి దగ్గరున్న మురికి వాడలోని రెండు వందల పేద కుటుంబాలకు రెండు పూటలా భోజనం పంపిస్తోంది. ‘‘మురికి వాడలో ఉండే వారి పరిస్థితి గురించి మా నాన్నగారు తెలుసుకున్నారు. వారికి ఆహారం అందించాలని మేం అనుకున్నాం. ఇంటికి దగ్గరలో ఆహారం వండించి, వారికి పంపిచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమకి తోచినంత సాయం చేయాలి. మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంది. దీనిని అదృష్టంగా భావించాలి. ఎవరి భోజనం వారు తింటున్నప్పుడు వారి ముఖంలో చిరు నవ్వు నాకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను ఈ రకంగా సాయం చేస్తున్నాను. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక వేళ లాక్ డౌన్ ను పొడగించినా కూడా ఆహారం పంపిస్తాను ’అని రకుల్ తెలిపింది. ఇది చిన్న సహాయమే అని, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని రకుల్ చెబుతోంది.

Tags: rakul, lockdown, kind heart, charity, heroine, telugu cinema

Advertisement

Next Story

Most Viewed