మరో మెగా హీరోతో రకుల్

by  |
మరో మెగా హీరోతో రకుల్
X

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ బిజీ బిజీగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్కు అసలు ఆఫర్లు లేకుండా పోయాయని మీడియా ప్రచారం చేసింది. మెగా కాంపౌండ్ హీరోయిన్గా వెలుగొందిన భామ చాన్స్లు లేక ఖాళీగా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, లాక్ డౌన్‌లో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రకుల్ తను ఫుల్ బిజీ అని చెప్పింది. నిబంధనలు సడలించగానే పనిలో బిజీ అయిపోవాల్సి ఉంటుందని తెలిపింది. చెప్పినట్లుగానే తాజాగా కొత్త సినిమా స్టార్ట్ చేసింది రకుల్. మళ్లీ ఓ మెగా హీరోతో జోడీ కట్టడం మరో విశేషం.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్‌లో ఓ చిత్రం పట్టాలెక్కుతుండగా.. ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది రకుల్. శుక్రవారం సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా, శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అక్టోబర్ వరకు చిత్రీకరణ పూర్తి చేసి నవంబర్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంతో ముందుకు సాగుతున్నాడు క్రిష్. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సాగే కథలో పవన్ రాబిన్ హుడ్ లాంటి పాత్ర చేస్తుండగా..నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

ఈ చిత్రం వైష్ణవ్‌కు రెండో సినిమా కాగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటుంది. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి డిటైల్స్ త్వరలో వెల్లడించనుంది మూవీ యూనిట్.


Next Story

Most Viewed