అతని కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రామ్ చరణ్ హీరోయిన్!

by Jakkula Samataha |   ( Updated:2024-04-26 11:49:46.0  )
అతని కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రామ్ చరణ్ హీరోయిన్!
X

దిశ, సినిమా :రాజకీయాల్లో సినీతారల ట్రెండ్ కొనసాగుతోంది. కొందరు హీరో, హీరోయిన్స్ తమకు నచ్చిన లీడర్స్ తరఫున ప్రచారం చేస్తూ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా చిరుత సినిమాలో రామ్ చరణ్ సరసన ఆడిపాడిన బ్యూటీ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో చాలా బీజీగా ఉంది.

తన తండ్రి అజిత్ శర్మ బీహార్‌లోని భాగల్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గురువారం బీహార్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ షోలో నేహా పాల్గొని, ప్రచారం చేసింది. దీంతో తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నేహా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ..ఎవరైనా హృదయంలో స్థానం ఇస్తే అక్కడ శాశ్వతంగా జీవిస్తారని చెబుతారు. మీరు నాపట్ల చూపిన ప్రేమ, ఆదరణ నా గుండెను నింపేసింది. పిర్ పైంటి, కహల్ గావ్ కు సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో ఈమె కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read More..

Faria Abdullah : అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. అతనిలో అదొక్కటి ఉంటే చాలు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed